సామాన్యుడి సరసన నిరసన గళం

Bob Dylan1963 ఆగస్టు, వాషింగ్టన్‌ నగరం. లక్షలాది ప్రజలు ఒక్క నినాదంతో కదం తొక్కిన వేళ. ఒక్క గొంతుతో పౌరహక్కుల కోసం నినదించిన వేళ. అమెరికా చరిత్రలో, ప్రపంచ పౌరహక్కుల ఉద్యమ చరిత్రలోనే చిరకాలం గుర్తుండిపోÄేలా ‘ఐ హావ్‌ ఏ డ్రీమ్‌’ అంటూ మార్టిన్‌ లూథర్‌కింగ్‌ ఉద్వేగంగా ఉపన్యసించిన సందర్భం. అంతలో నిర్వాహకుడు మైకు ముందుకొచ్చి ‘న్యూయార్కు నుంచి వచ్చిన ఈ యువకుడు ఒక గాయకుడు. ఇతని పేరు ‘బాబ్‌ డిలన్‌’ అంటూ జీన్స్‌, కాటన్‌ షర్టు వేసుకున్న ఒక బక్క పలచని యువకుడిని పరిచయం చేశాడు.
Continue reading

పోగొట్టుకొన్నవాడి పాట

సమీక్ష రచన : విన్నకోట రవిశంకర్

శిఖామణి మొదటి పుస్తకం “మువ్వల చేతికర్ర” లో “కొయ్య కాలు” అనే కవిత ఉంది. ఈ కవితను ముందుమాటలో ప్రస్తావిస్తూ ఇస్మాయిల్ గారు ఇలా రాసారు -  “కవిత్వం కవికి కొయ్యకాలు లాంటిది. తను కోల్పోయిన దేనికో substitute. తనను తాను తలక్రిందులుగా పాతుకుంటేనేకానీ అది చిగిర్చదు.”  నారాయణస్వామి రెండో పుస్తకం “సందుక” చదివినప్పుడు వెంటనే నాకీ వాక్యాలు గుర్తుకువచ్చాయి. తను కోల్పోయినదానిని కవిత్వంతో భర్తీ చేసుకునే ప్రయత్నం ఈ పుస్తకం నిండా కనిపిస్తుంది. సందుక, అర్ర, ఊరి చెరువు ఏదైనా కోల్పోవడానికి ఒక ప్రతీక మాత్రమే. స్వామి తనను తాను తలక్రిందులుగా పాతుకోకపోయినా,తన ఊరినించి తెచ్చిన “చిన్నారి మొక్క”ను తనలో తలక్రిందులుగా పాతుకున్నాడు. దాని పూల ఎరుపుదనం నెత్తురులోకి చొచ్చుకొనిపోయి, శరీరమంతా వ్యాపించింది. అది బహుశ అతని కవిత్వమే కావచ్చు.

పూర్తిగా చదవండి »

సందుక పై ‘చరసాల’ అభిప్రాయం

తెలంగాణా పల్లె జీవితాల శ్వాస ఇది. యాస వేరేనే గానీ ఆత్మ ఒక్కటే .. అది తెలంగాణా అయినా రాయలసీమ అయినా.. మా ముసలి అవ్వ నా వీపు నిమిరినంత అనుభూతి. వూరికి ఫోను చేసిన ప్రతిసారీ “ఎప్పుడొస్తావు నాయనా” అని అడిగే ఆప్యాయపు పలుకుల్ని ఈ కవిత మళ్ళీ గుర్తు చేసి గుండె తడిని మరింత పెంచింది…

ఎన్నో కోల్పోతున్నామనే బాధ మనసును ఎల్లవేళలా మెలిపెడుతూనే వున్నా ఈ స్వామి కవితలు చదివాక నా మనసు పడే బాదకు అక్షర రూపమిదేనా అని మళ్ళీ మళ్ళీ వాటిని తడిమి చూసుకుంటున్నా…

పూర్తిగా చదవండి >>

కన్న పానం కదా!

వాళ్ళు కంటి నిండా నిద్రే పోలేదో
కడుపు నిండా తిండే తినలేదో

చెమట చెమట కూడబెట్టి
నలభయీఇదు తో భాగించి
నీ కోసం పంపిండ్రు.

నడవడానికి కాళ్ళుంటే సరిపోవా
అనుకున్నరు కనకనే

వాళ్ళ రెక్కలు కత్తిరించి
నీకతుకుబెట్టి
ఏడు సముద్రాలు
దాటించిండ్రు

Continue reading

అంజాన్

తలపై
రెండు నిండు మట్టి కుండలతోఅరచేతుల్లో
ఎగరడానికి సిద్దంగా ఉన్న పక్షి పిల్లలతో

దూది మబ్బుల నీలి నీటి

ఆకాశం తెరలపైన తేలుతూ

పేగు తెంచుకున్న నేల మీద పెంచుకున్న

ఎనలేని ప్రేమలతో
రాలాను …

విమాానం కిటికీల్లోంచి
కింద వంటి మీద
కొత్త కొత్త నగల్తో కొత్త కొత్త వలువలతో
కొంగ్రొత్త చూపుల్తో
నా నగరం…..నా ఆదిమ ప్రేయసి!
Continue reading

అవ్వా !

‘ మల్ల యెప్పుడొస్తవు కొడుకా avva
యేండ్ల ముచ్చట్లు చెప్పుకొనే
బుద్ది తీరకముందే
బయల్దేరిన
నా చెయ్యిని చేతులల్లకు తీసుకుంది -

గుడ్డి అద్దాల కండ్లెనుక
కుర్వక కుర్వక కుండపోతగ
కురిసిన వానసుంటి
ఆపేక్ష -

Continue reading

సందుక !

నువ్వెప్పుడూ యింతే .Sanduka
మనం కలిసినప్పుడల్ల
ఆ పాతకాలపు సందూకను
తీయిస్తవు .

దాన్ని తీసినప్పుడల్ల
పైనున్న దుమ్ము చెదిరిపోయి
మన చిన్నతనం
మాసిపోతుందేమోనని
నాకు ఒకటే రంది.

Continue reading

చెరువేమయ్యింది !

యిక్కడ వొక చెరువుండేటిదీ
‘యేదీ యిప్పుడు ‘కూలిపోయిన
కట్ట మిద నడుసుకుంటూ
మట్టి బెడ్డలేరుకుంటం.

కాలం కానప్పుడు
కనీసం వొక బురదగుంటలెక్కనయిన వుండేదీ .

Continue reading

తల్లి తెలంగాణ

యిన్నేండ్లుగ
యెన్నడూ వినబడని గొంతు వొకటి
నెర్రెలు బారిన నేలమీద యెగిరి దుంకి
‘ ఇదంత నా నేల
దీని సరిహద్దు గీతల్ని నేను నిర్ణయిస్తా
అని ప్రకటించింది.’ఈ నక్ష మీద
అధికారం మొత్తం నాదే కావాలీ అంటూ
పెద్ద నోరుతో అరిచింది.

Continue reading

యాడికిపోయిన్రు

‘ లెక్కలేనంత మంది …’ఎన్నాండ్ల సందో ఆపుకున్న దుక్కం
ఒక్క సారి పొర్లుకు రాంగనే
చెంగు నోటికడ్డం పెట్టుకోని
పక్కున పగిలింది -

తంగేడి పూలసుంటోల్లు
‘అంత యీ మూడు నాలుగేండ్లల్లనే
రాలిపోయిండ్రు -
యెవ్వరు ముప్పైయేండ్లు దాటలే …’

Continue reading