చెప్పలేని
దిగులు వ్యథలో
చలిని కప్పుకు వణికిన
ఒక ఎండు చేతుల రాత్రి -ఎర్రెర్రగా తొంగిచూస్తున్న
చెట్ల చిగుళ్ళ చిరునవ్వులనుకాలాన్ని వెనక్కి జరిపి
కౌగలించుకుంటుంది .
మంచు మైదానమై
పరుచుకున్న
శిశిర చీకటిలోంచి
ఒక ఆకుపచ్చని గడ్డిపూలమొక్క -బంగారు రెమ్మల కళ్ళతో
తొట్టతొలి కిరణాన్ని
ముద్దాడుతుంది .క్రూరమైన దినచర్యలో
ఒళ్ళంతా కమిలిన
ఆకాశం -తళుక్కున వేళ్ళాడే
నెలవంక చిర్నవ్వుని
ఆప్యాయంగా అక్కున
చేర్చుకుంటుంది .వెన్నెల రజనుతో మెరిసే
ఒక స్వేచ్చా సాయంకాలంవళ్ళు విరుచుకుంటున్న
వేకువ తో
కరచాలనం చేస్తుందిపూడుకుపోయిన గొంతుల
మౌన సంభాషణలనిబరువెక్కిన గడియారం
ముండ్ల గుసగుసలు మోస్తాయితడియారని మెరిసే కళ్ళని
కలిపేందుకుఆకాశం చుక్కల చాపలా
చుట్టుకుంటుందిసాయంత్రంలో మునిగిపోయే పగలూ
ఉదయమై ఎగిసిపోయే రాత్రీ -జీవితం పరిమళించే
ఒక కొత్త రోజుగా
విచ్చుకుంటూ….- నారాయణస్వామి
వేకువ సంధ్య
సెప్టెంబరు 26, 2006 · వ్యాఖ్యానించండి
వర్గాలు Poems · Telugu (తెలుగు)




0 స్పందనలు so far ↓
There are no comments yet...Kick things off by filling out the form below.