ఒక గొప్ప ప్రారంభం కోసం
అన్‌వేషణ
పేలవమైన ముగింపుగా
కొట్టుమిట్టాడుతుందివేయి తుపాకుల ముందుకూడా
తలవంచని ధైర్యం
తోవ తెలియని తనంతో
నీరు కారిపోతుంది
తుఫాను ప్రచండతను
ఊపిరిగా పీల్చిన యవ్వనం
పత్రహరితం పరాధీనమై
చిరుగాలులకు సైతం
కంపించి పోతుందివాగునీటి గలగలల
పరిమళాలు వెదజల్లిన
వెన్నెల రాత్రుల అమాయకత్వం
విచ్చుకత్తులు దూసిన పేటెంట్ల మధ్య
అస్తిత్వం కోల్పోతుందికొత్త ఆకాశాల కోసం
అరమోడ్పు కళ్ళతో తపించిన
నెలవంక
గ్లోబలైజేషన్ స్వప్న రాహిత్యం లో
వెలవెల పోతుందిభవిష్యత్తుపై
ప్రేమతో
వర్తమానాన్ని ధిక్కరించిన
ఆకాంక్ష
చరిత్ర చీకటినీడల్లో
గతం కన్నీటి మరకగా
మిగిలిపోతుందిమార్కెట్ మాయాజాలంలో
ప్రతి మజిలీ దగ్గర
చౌరస్తా అయిపోయిన ప్రయాణం
తిరిగి తిరిగి ప్రారంభానికే
చేరిపోతుంది- నారాయణస్వామి
స్వప్నరాహిత్యం
సెప్టెంబరు 28, 2006 · వ్యాఖ్యానించండి
వర్గాలు Poems · Telugu (తెలుగు)




0 స్పందనలు so far ↓
There are no comments yet...Kick things off by filling out the form below.