Sanduka : The Nostalgic Chest

మనం ఏది కోల్పోయామో !

అక్టోబర్ 2, 2006 · వ్యాఖ్యానించండి

మనం ఏది కోల్పోయామో
అది ఒక
జీవిత కాల వాంచా దుఖ్కమౌతుందిమన జీవితం నిండా దొరికే దుఖ్కం
ఎన్నటికీ తీరని
ఆశ గా వెంటాడుతుంది

ఆశల్ని కోల్పోయి
వ్యథల్ని ఆహ్వానిస్తామో

వాంఛలని కౌగలించుకుని
జీవితాన్ని కొనుక్కుంటామో …

ఆశకీ వాంఛకీ వ్యాపారం వారధి
దుఖ్కానికీ జీవితానికీ స్వప్నం పరమఆవధి

దహించాలి
ఆశలో దుఖ్కపు కన్నీళ్ళనీ
స్వప్నంలో వాంఛా దుఖ్కాన్నీ
నిలువున దగ్ధం చేయాలి

వేదన లేని రేపటిని
పుష్పించే స్వప్నాన్ని

వ్యథారహిత క్షణాల్ని
ప్రేమించే కొత్త ఆశల్నీ

కంటి నిండా దుఖ్కించాలి

- నారాయణస్వామి

వర్గాలు Poems · Telugu (తెలుగు)

0 responses so far ↓

  • There are no comments yet...Kick things off by filling out the form below.

వ్యాఖ్యానించండి