ఇన్నాళ్ళ ఎడబాటు తర్వాత
మనం మళ్ళీ
వంటరిగా కూర్చుని
పాత నోటుబుక్కుల్లోంచి
ఎండి పోయిన ఆకుల్ని
ఒకటొకటిగా బయటకు తీస్తాంశతాబ్దానంతర కరచాలనంలో
డాలర్ గరగరలు
కర్కశంగా తగులుతాయి
పేర్చుకున్న రంగు కాగితాల నుండి
దుఖ్కపు పొరల పెళుసులు
పర్చుకున్న శూన్యంలోకి
రాలిపడుతుంటైఇప్పుడు
ఇన్ని యుగాల దూరంలో
మన రెండు వంటరి ప్రపంచాల్లో
దోసిళ్ళ కొద్దీ
గతాన్ని
మళ్ళీ
కలబోసుకోగలమా?బిగపట్టుకున్న
వెక్కిళ్ళనాపి
ఎగసిపడే
ఎర్రజీరల్నీ
యధేఛ్చగా
విరబూయగలమా!
దుర్భేద్యమైన గాజు గోడల మధ్య నిలబడి
ఎంత దగ్గరగా మాట్లాడుకున్నా
ఒకరి మౌనం ఒకరికి అర్థం కాదుఎన్ని ఎడతెగని రాత్రుల చీకటిలో దేవులాడుకున్నా
ఒకరి చూపు ఒకరికి కనబడదుదుమ్ము పట్టిపోయిన గ్యాపకాల తోటలో
ఒక్క పువ్వునూ పోల్చుకోలేముమైళ్ళ కొద్దీ
నడిచిన రస్తాలో
ఒక్క గులక రాయినీ
స్వంతం చేసుకోలేంఇన్ని యుగాల మన ఆత్మీయత
రెండు కన్నీటి చుక్కలుగానైనా
ఘనీభవించలేదుఇంతకూ
ఇన్నేళ్ళ తర్వాత కలుసుకుని
ఏ గాయాల గూర్చి మాట్లాడుకుంటున్నామో
ఏ నెత్తుటి మరకలని తడుముకుంటున్నామో
ఏ కన్నీటి చారికల్ని వెతుక్కుంటున్నామోడాలర్ గుణింతపు లెక్కల అధికార పొరల మధ్య
ఎప్పటికైనా అస్పష్టంగానైనా
మనకు అర్థం అవుతుందంటావా!- నారాయణస్వామి
కలయిక
అక్టోబర్ 3, 2006 · వ్యాఖ్యానించండి
వర్గాలు Poems · Telugu (తెలుగు)




0 responses so far ↓
There are no comments yet...Kick things off by filling out the form below.