‘ లెక్కలేనంత మంది …’ఎన్నాండ్ల సందో ఆపుకున్న దుక్కం
ఒక్క సారి పొర్లుకు రాంగనే
చెంగు నోటికడ్డం పెట్టుకోని
పక్కున పగిలింది -తంగేడి పూలసుంటోల్లు
‘అంత యీ మూడు నాలుగేండ్లల్లనే
రాలిపోయిండ్రు -
యెవ్వరు ముప్పైయేండ్లు దాటలే …’
నిన్న గాక మొన్న చూసినట్టుంది -
కండ్లల్ల మెదులుతుండ్రు.‘ పచ్చని చెట్లలెక్క ఉండెటొల్లు.
ఒక్కొక్కలే పీనుగలై వస్తుంటె
కడుపంత తోడినట్టై
పానం కలకలా అన్నది.’వూర్లల్ల పిలుద్దామన్నా
ఒక్క వయసుపొల్లగాడు
కనబడతలేడు.‘ సావంగ మిగిలినోల్లు
బతుక పారిపోయిండ్రు.’యిండ్లన్ని మొండిగోడలైనయి.
కుంటలు బాయిలు ఎండుకపోయినయి.‘యెంత చెప్పుకున్నా యెతలు దీరయి తమ్మీ ..’
చిన్నప్పట్నుండి
కాల్లల్ల మెసిలినోల్లు
బుద్ది తెలిసినకాడినుంచి
ఎవ్వరికి అన్నాలం చెయ్యనోల్లుబూడిదకూడ మిగలకుంట పోయిండ్రు.
‘వూర్లన్నీ పాడుబడ్డ బాయిల్లెక్కయినయీ .
కల్సి ఆడుకున్నోల్లంత
యాడికిబోయిన్రో మనసున బట్టక
గాలి
యిండ్ల ముంగట
చెదలుపట్టిన మొగురాలకు
కూలబడ్డది.వూర్లకు వూర్లే
ఎందుకు చిన్నబోయినయోనని
యెండుకపోయిన కొమ్మలు
యెక్కిల్లు పట్టి యేడుస్తున్నయి.- నారాయణస్వామి
యాడికిపోయిన్రు
అక్టోబర్ 5, 2006 · 1 వ్యాఖ్య
వర్గాలు Poems · Telugu (తెలుగు)




1 స్పందన so far ↓
Sudheer Kothuri // నవంబరు 7, 2006 వద్ద 7:12 పూర్వాహ్నం
కళ్ళు చెమ్మగిల్లాయి. నాలో ఇంత సెన్సిటివ్ స్వభావం వుందని ఎప్పుడూ గ్రహించలేదు.”గాలి
యిండ్ల ముంగట
చెదలుపట్టిన మొగురాలకు
కూలబడ్డది” బాధ తీవ్రతను ఈ expression తో హృదయాన్ని తాకేలా చెప్పారు.