సామాన్యుడి సరసన నిరసన గళం

Bob Dylan1963 ఆగస్టు, వాషింగ్టన్‌ నగరం. లక్షలాది ప్రజలు ఒక్క నినాదంతో కదం తొక్కిన వేళ. ఒక్క గొంతుతో పౌరహక్కుల కోసం నినదించిన వేళ. అమెరికా చరిత్రలో, ప్రపంచ పౌరహక్కుల ఉద్యమ చరిత్రలోనే చిరకాలం గుర్తుండిపోÄేలా ‘ఐ హావ్‌ ఏ డ్రీమ్‌’ అంటూ మార్టిన్‌ లూథర్‌కింగ్‌ ఉద్వేగంగా ఉపన్యసించిన సందర్భం. అంతలో నిర్వాహకుడు మైకు ముందుకొచ్చి ‘న్యూయార్కు నుంచి వచ్చిన ఈ యువకుడు ఒక గాయకుడు. ఇతని పేరు ‘బాబ్‌ డిలన్‌’ అంటూ జీన్స్‌, కాటన్‌ షర్టు వేసుకున్న ఒక బక్క పలచని యువకుడిని పరిచయం చేశాడు.

బాబ్‌ డిలన్‌ రాసిన పాటలు ఇప్పటికీ ప్రజాస్వామిక వాదుల హృదయాల్లో, హక్కులకోసం కదను తొక్కుతున్న ప్రజల నినాదాల్లో సజీవంగా ఉన్నాయి. కొలంబియా విశ్వవిద్యాలయం డిలన్‌కి ‘పులిట్జర్‌’ని ప్రకటించి ఆ బహుమతి విలువని ద్విగుణీకృతం చేసింది.

ఆయనతో పాటు ఓ అందమైన అమ్మాయి కూడా మైకు మందుకొచ్చింది. ఆ అమ్మాయి జోన్‌బయాజ్‌. ఆమె అప్పటికే పౌర హక్కుల ఉద్యమంతో చాలా సన్నిహితంగా పనిచేస్తూ అనేక సభల్లో, ప్రదర్శనల్లో గొం తెత్తి అద్భుతంగా పాడుతున్నది. బాబ్‌ డిలన్‌ ఒకసారి గొంతు సవరించుకున్నాడు. ‘ఇప్పుడు నేను పాడబోయే పాట పౌరహక్కుల ఉద్యమ నాయకుడు మెడ్గర్‌ ఎవర్స్‌ ని హత్య చేసిన హంతకుడి గురించి’ అంటూ పాట ఎత్తుకున్నాడు.

Bob Dylanపొద వెనక నుండి పేలిన బులెట్‌
మెడ్గర్‌ ఎవర్స్‌ రక్తాన్ని రుచి చూసింది.
…అయితే వాడిని నిందించలేము
అతడు వాళ్ళ ఆటలో ఒక పావు మాత్రమే!

అట్లా సాగిన పాట, తెల్లవాళ్ళ ఆధిపత్య వ్యవస్థ ఒక పేద తెల్లవాడికి ఎలా అబద్ధాలు చెప్పి మోసం చేస్తుందో, ఎట్లా వాడిలో తప్పుడు చైతన్యాన్ని విషంగా నింపుతోందో అద్భుతంగా విశదీకరించింది. 1941 మే 24 న అమెరికాలోని మిన్నెసోటాలో డలత్‌ పట్టణంలో ఒక సామాన్య మధ్య తరగతి యూదుల కుటుంబంలో రాబర్ట్‌ అలెన్‌ జ్మిర్మేన్‌ (డిలన్‌) పుట్టాడు. చిన్నప్పటి నుంచే సంగీతం పట్ల ముఖ్యంగా ఫోక్‌, కంట్రీ(జానపద సంగీతంలో భిన్న పాయలు)సంగీతం పట్ల మక్కువ పెంచుకున్న రాబర్ట్‌ హై స్కూల్‌ తర్వాత కాలేజీలో చేరినా చదువు మీద మనసు పెట్టలేకపోయాడు. ఫోక్‌ సంగీతంపై అమితమైన ఆసక్తితో రాబర్ట్‌ కాఫీ క్లబ్బుల్లో, ఫోక్‌ సంగీత సర్క్యూట్లలో పాటలుపాడడం ప్రారం భించాడు. అయితే మినియాపాలిస్‌ ఆయన సంగీత తృష్ణని తీర్చలేకపోయింది.

1961 జనవరిలో మంచుపడే ఒక రోజు తన సూట్కేసు సర్దుకుని జేబులో పది డాలర్లతో ఎవరి దగ్గరో లిప్టు తీసుకుని న్యూయార్క్‌ నగరాని కి బయలుదేరాడు. న్యూయార్క్‌ నగరంలోని గ్రీన్‌ విచ్‌ విలేజి చేరుకున్న రాబర్ట్‌ ముందుగా తన పేరు మార్చుకున్నాడు. తనకు ఇష్టమైనకవుల్లో ఒకరైన డిలన్‌ థామస్‌ పేరులోని మొదటి భాగం డిలన్‌ని తన చివరి పేరుగా మార్చుకున్నాడు. బాబ్‌ డిలన్‌గా అవతారమెత్తాడు. బాబ్‌డిలన్‌ చేరుకున్న సమయానికి నూయార్క్‌ గ్రీన్‌విచ్‌ విలేజి ఒక మహాద్భుతమైన ప్రదేశం. ఒక ప్రత్యామ్నాయ సాంస్క­ృతిక కేంద్రం.

అమెరికా ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎదుర్కొని తన పాటలను ప్రజలకు అంకితం చేసిన నిబద్ధ కవీ, సంగీతకారుడు వూడీ గథ్రీ ఒక ఆస్పత్రిలో చికిత్స పొం దుతుండటంతతో వెళ్ళి కలిశాడు బాబ్‌. అమెరికా సమాజాన్ని అతలాకుతలం చేస్తున్న సామాజిక రాజకీయ ఉద్యమా లు, పౌరహక్కుల ఉద్యమం, ముఖ్యంగా నల్ల జాతి వాళ్లకు సమానహక్కుల కోసం సాగుతున్న బ్రహ్మాండమైన పోరాటాలు, తెల్లపాలకుల అప్రజాస్వామిక పాలన నూ, వారి యుద్ధోన్మాదాన్ని నిరసిస్తూ ఉవ్వెత్తున ఎగుస్తున్న నిరసన ప్రదర్శన జ్వాలలు, అన్ని అధికార విలువల్నీ, చట్రాల్నీ, వ్యవస్థీకృత ఆధిపత్యాన్నీ ధిక్కరిస్తూ సాంస్క­ృతిక రంగంలో ముందుకొచ్చిన ప్రత్యామ్నాయ, ప్రతికూల సాం స్క­ృతికోద్యమం- బాబ్‌డిలన్‌ని తీవ్రంగా ప్రభావితం చేశాయి.

అప్పటి దాకా తనకు తానుగా ఒకటి రెండు పాటలు మాత్రమే రాసి ఎక్కువగా ఇతరుల పాటలు పాడుతున్న బాబ్‌డిలన్‌ ( ఆయన రాసిన తొలి పాటల్లో ఒకటి వూడీ గథ్రీపై రాసింది) స్వయంగా పాటలు రాయడం ప్రారంభిం చాడు. యుద్ధ వాతావరణాన్ని, పాలకుల మృత్యుదాహాన్ని, సామాన్య ప్రజానీకంలో ఉన్న నిర్లిప్తతనూ వ్యతిరేకిస్తూ డిలన్‌ రాసిన ‘బ్లోయింగ్‌ ఇన్‌ ది విండ్‌’ పాట అమెరికా సంగీత ఆకాశంలో ఒక కొత్త సూర్యుడిలా ప్రజ్వలించింది. అటువంటిదే మరొకటి ‘మాస్టర్స్‌ ఆఫ్‌ వార్‌’. దాని స్వేచ్ఛానుసరణ చూడండి.

యుద్ధోన్మాద పాలకుల్లారా!

తుపాకులని తయారుచేసేది మీరు-
మృత్యువిమానాలని తయారుచేసేది మీరు-
భూతాల్లాంటి బాంబులు తయారు చేసేది మీరు-
గోడలవెనుక దాక్కుంటున్నారా
అందమైన ఆఫీసు డెస్కులవెనుక దాక్కుంటున్నారా
మీకు తెలుసో లేదో
నేను మీ ముసుగులనీ చీల్చి చూడగలను!
మీరిప్పటిదాకా ఏంచేశారు
విధ్వంసం చేయడానికి నిర్మించడం తప్ప

అంటూ పాలకుల యుద్ధోన్మాదాన్ని చీల్చి చెండాడుతూ డిలన్‌ రాసిన పాట వాషింగ్టన్‌ మర ఫిరంగి పేల్చింది. ఆపాటలో చివరగా

‘మీరు చచ్చిపోవాలని కోరుకుంటున్నా-
అతి తొందరగా మీకు చావు రావాలని
యెంతో ఆశపడుతున్నా!
పాలిపోయిన ఒక మధ్యాహ్నం పూట
స్మశానం దాకా నడుస్తా మీ శవపేటికల వెంట!
చూస్తా మృత్యుశయ్య మీదికి
మిమ్మల్ని దించుతుంటే
నిలబడుతా మీ సమాధివద్ద
మీరు చచ్చి పోయిండ్రని ఖరారయ్యేదాక!!’

అని డిలన్‌ రాయడం ఒక గొప్ప నిరసన జ్వాలై ఎగసింది. ఎక్కడ యుద్ధ వ్యతిరేక ప్రదర్శన అయినా, ఏ మారుమూల పౌరహక్కుల కోసం ప్రజలు కదనుతొక్కినా ‘బ్లోయింగ్‌ ఇన్‌ ది విండ్‌’ , ‘మాస్టర్స్‌ ఆఫ్‌వార్‌ ‘పాటలు ప్రజల నాలుకల మీద సామూహికం గా పలికినయి. ‘ఎ హార్డ్‌ రెయిన్‌ ఈజ్‌ గోయింగ్‌ టు ఫాల్‌’ పాట అతని కవిత్వంలోకెల్లా అత్యంత శక్తివంతమైంది. సెప్టెంబర్‌ 1962 లో తలెత్తిన క్యూబా సంక్షోభం, అనాటి సామాజిక స్థితిగతులూ దృష్టిలో పెట్టుకుని రాసిన ఆ పాట సమకాలీనతనూ విశ్వజనీనతనూ సంతరించుకుని మైలురాయిగా నిలిచింది.

అమెరికా ఖండాన్ని కొలంబస్‌ కనుగొన్నప్పటి నుంచి నాలుగు శతాబ్దాలపాటు తెల్లవాళ్ళు నేటివ్‌ అమెరికన్లని ఎంత దారుణంగా ఊచకోత కోశారో, ఎన్ని సంస్క­ృతులని. తెగలని, భాషలని సర్వనాశనం చేశారో చెప్పనలవి కాదు. వారిని గురించి రాస్తూ ‘దేవుడు మా వైవునున్నాడు’ అనే పాటలో ప్రపంచ చరిత్రలో దురాక్రమణలు చేసి, వూచకోతలు కోసిన ‘వాళ్లందరి వైపునా దేవుడున్నాడు’ అంటూ ఎద్దేవా చేస్తాడు డిలన్‌. 1950 అ మధ్య నుండి 1960 ల మధ్య దాకా అమెరికా లో ఫోక్‌ సంగీతం పునరుజ్జీవనం పొంది, ప్రజాస్వామిక ఉద్యమాలకు, యుద్ధవ్యతిరేకోద్యమాలకూ అత్యంత శక్తివంతమైన మాధ్యమైంది. కనెక్టికట్‌ రాష్ట్రంలోని న్యూపోర్ట్‌ పట్టణంలో ప్రతి ఏటా జరిగే ఫోక్‌ ఫెస్టివల్‌ 1962లో బాబ్‌ డిలన్‌ కొత్తగా సుడిగాలై వీచాడు.

ప్రేమ, జీవనవిషాదం, వైఫల్యం, దేశదిమ్మదితనం ఇంకా అనేకానేక అంశా ల మీద డిలన్‌ పాటలు రాశాడు. అయితే కవి అని పిలిపించుకోవడానికి ఇష్టపడలేదు. తానెప్పుడూ గాయకుడు, సంగీతకారుడిగానే అని చెప్పుకునేవాడు. తనని ఒక రాజకీయ కవిగా, గాయకుడిగా అందరూ ముద్ర వేయడం డిలన్‌కు నచ్చలేదు. ఒక ముద్ర అంటూ పడ్డాక అందరూ తన నుంచి ఎప్పుడూ అదే ఆశిస్తారని అట్లా చేయ డం తనకిష్టంలేదని బాహాటంగా చెప్పుకున్నాడు. 1963 డిసెంబర్లో అత్యవసర పౌరహక్కుల కమిటీ డిలన్‌ కు ప్రకటించిన టామ్‌ పేన్‌ అవార్డుని స్వీకరిస్తూ తనపై ఒక నిరసన కవి అనో, వామపక్ష కవి అనో ముద్రలు వేయడాన్ని వ్యతిరేకిస్తూ తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. అందరి ఆగ్రహానికి గురయ్యాడు. తనని ఎంతో చేరదీసి, ప్రేమించి, తన పాటలకెన్నింటికో గొంతునిచ్చిన జోన్‌బయాజ్‌ని దూరం చేసుకున్నాడు.

1965 న్యూపోర్ట్‌ ఫోక్‌ ఫెస్టివల్‌లో ఎలెక్ట్రిక్‌ గిటార్‌ వాయిస్తూ పాడి, ఫోక్‌ సంగీతానికి బద్ధ విరుద్ధమైన శబ్ద కాలుష్యం సృష్టించాడు. అప్పటి దాకా తనకి ఊపిరి పోసి, ఊతాన్నిచ్చిన ఫోక్‌ సంగీతాన్ని, సాంస్క­ృతికోద్యమ మిత్రులనీ వదిలి రాక్‌ సంగీతంలోకి వెళ్ళిపోయాడు. 1966లో ఒక మోటర్‌ సైకిల్‌ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఏడాదిన్నర పాటు సంగీత ప్రపంచానికి దూరంగా ఉన్నాడు. తర్వాత 1970లో క్రిష్టియన్‌గా పునర్జన్మ ఎత్తానని చెప్పుకుని మత సంబంధమైన పాటలు రాశాడు. మళ్ళీ 1975లో దాదాపు పన్నెండేళ్ళ తర్వాత ‘హరికేన్‌’ అనే ఒక నిరసన గీతాన్ని రాశాడు.

రూబిన్‌ కార్టర్‌ అనే ఒక నల్లజాతి బాక్సింగ్‌ యోధుడిని మూడు హత్య కేసుల్లో ఇరికించిన శ్వేత జాత్యంహకార ప్రభుత్వాన్ని తూర్పారబడుతూ రాసిన ఈ పాట గతంలో ఆయన రాసిన నిరసన గీతాల స్థాయిలో చాలా శక్తివంతమైంది. అనెన్‌ గిన్స్‌ బర్గ్‌, జాక్‌ ఎలియట్‌, మిక్‌ రాన్సన్‌ లాంటి అనే క మంది ప్రత్యామ్నాయ సంస్క­ృతికి చెందిన కవులు,కళాకారులతో డిలన్‌ కలిసి పనిచేశాడు. ఇప్పటికీ కళాకారుడిగా, సంగీతకారుడి గా, కవిగా పాటలు రాస్తున్నాడు, పాడుతున్నాడు, ఈ మధ్యే ‘మోడర్న్‌టైమ్స్‌’ అని డిలన్‌ విడుదల చేసిన పాటల సంకలనం చార్ట్స్‌ లో మొదటి స్థానంలో నిల్చింది.

అయితే అందులో పాడిన చాలా పాటలు ఆయన తొలిరోజుల్లో రాసిన నిరసన గీతాలే కావడం యాదృచ్ఛికం కాదు. ఇప్పటికే కనీసం రెండున్నర లక్షల మంది ఊచకోతకు గురయిన మారణ కాండ ఇరాక్‌లో జరుగుతున్నది. ఇరాన్‌ మీద కూడా యుద్ధం ప్రకటిస్తానని అమెరికా రంకెలు వేస్తున్నది. ఈ సందర్భంలో యుద్ధాన్ని నిరసిస్తూ, యుద్ధోన్మాద పాలకు ల చావు కోరుకుంటూ డిలన్‌ రాసిన పాటలు ఎంతో సమకాలీనంగా ధ్వనిస్తాయి. ఆయన రాసిన పాటలు ఇప్పటికీ ప్రజాస్వామిక వాదు ల హృదయాల్లో, పోరాడుతున్న, నిరసిస్తున్న, హక్కులకోసం, న్యా యం కోసం కదను తొక్కుతూ కవాతు చేస్తున్న ప్రజల నినాదాల్లో సజీవంగా ఉన్నాయి. కొలంబియా విశ్వవిద్యాలయం డిలన్‌కి ప్రతిష్ఠాత్మక పులిట్జర్‌ని బహుకరించి ఆ బహుమతి విలువని ద్విగుణీకృతం చేసింది.

(Courtesy: 14th April 2008 AndhraJyothy)

One Response to సామాన్యుడి సరసన నిరసన గళం

ప్రత్యుత్తరమిమ్ము

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )