1963 ఆగస్టు, వాషింగ్టన్ నగరం. లక్షలాది ప్రజలు ఒక్క నినాదంతో కదం తొక్కిన వేళ. ఒక్క గొంతుతో పౌరహక్కుల కోసం నినదించిన వేళ. అమెరికా చరిత్రలో, ప్రపంచ పౌరహక్కుల ఉద్యమ చరిత్రలోనే చిరకాలం గుర్తుండిపోÄేలా ‘ఐ హావ్ ఏ డ్రీమ్’ అంటూ మార్టిన్ లూథర్‌కింగ్ ఉద్వేగంగా ఉపన్యసించిన సందర్భం. అంతలో నిర్వాహకుడు మైకు ముందుకొచ్చి ‘న్యూయార్కు నుంచి వచ్చిన ఈ యువకుడు ఒక గాయకుడు. ఇతని పేరు ‘బాబ్ డిలన్’ అంటూ జీన్స్, కాటన్ షర్టు వేసుకున్న ఒక బక్క పలచని యువకుడిని పరిచయం చేశాడు.
(ఇంకా…)
Entries categorized as ‘సమీక్ష’
సామాన్యుడి సరసన నిరసన గళం
ఏప్రియల్ 14, 2008 · 1 వ్యాఖ్య
వర్గాలు In News · Telugu (తెలుగు) · సమీక్ష
Tagged: Andhra Jyothy, బాబ్ డిలన్, bob dylan, Narayan Swamy
పోగొట్టుకొన్నవాడి పాట
జనవరి 1, 2007 · వ్యాఖ్యానించండి
సమీక్ష రచన : విన్నకోట రవిశంకర్
శిఖామణి మొదటి పుస్తకం “మువ్వల చేతికర్ర” లో “కొయ్య కాలు” అనే కవిత ఉంది. ఈ కవితను ముందుమాటలో ప్రస్తావిస్తూ ఇస్మాయిల్ గారు ఇలా రాసారు - “కవిత్వం కవికి కొయ్యకాలు లాంటిది. తను కోల్పోయిన దేనికో substitute. తనను తాను తలక్రిందులుగా పాతుకుంటేనేకానీ అది చిగిర్చదు.” నారాయణస్వామి రెండో పుస్తకం “సందుక” చదివినప్పుడు వెంటనే నాకీ వాక్యాలు గుర్తుకువచ్చాయి. తను కోల్పోయినదానిని కవిత్వంతో భర్తీ చేసుకునే ప్రయత్నం ఈ పుస్తకం నిండా కనిపిస్తుంది. సందుక, అర్ర, ఊరి చెరువు ఏదైనా కోల్పోవడానికి ఒక ప్రతీక మాత్రమే. స్వామి తనను తాను తలక్రిందులుగా పాతుకోకపోయినా,తన ఊరినించి తెచ్చిన “చిన్నారి మొక్క”ను తనలో తలక్రిందులుగా పాతుకున్నాడు. దాని పూల ఎరుపుదనం నెత్తురులోకి చొచ్చుకొనిపోయి, శరీరమంతా వ్యాపించింది. అది బహుశ అతని కవిత్వమే కావచ్చు.
వర్గాలు సమీక్ష



