Sanduka : The Nostalgic Chest

Entries categorized as ‘In News’

సామాన్యుడి సరసన నిరసన గళం

ఏప్రియల్ 14, 2008 · 1 వ్యాఖ్య

Bob Dylan1963 ఆగస్టు, వాషింగ్టన్‌ నగరం. లక్షలాది ప్రజలు ఒక్క నినాదంతో కదం తొక్కిన వేళ. ఒక్క గొంతుతో పౌరహక్కుల కోసం నినదించిన వేళ. అమెరికా చరిత్రలో, ప్రపంచ పౌరహక్కుల ఉద్యమ చరిత్రలోనే చిరకాలం గుర్తుండిపోÄేలా ‘ఐ హావ్‌ ఏ డ్రీమ్‌’ అంటూ మార్టిన్‌ లూథర్‌కింగ్‌ ఉద్వేగంగా ఉపన్యసించిన సందర్భం. అంతలో నిర్వాహకుడు మైకు ముందుకొచ్చి ‘న్యూయార్కు నుంచి వచ్చిన ఈ యువకుడు ఒక గాయకుడు. ఇతని పేరు ‘బాబ్‌ డిలన్‌’ అంటూ జీన్స్‌, కాటన్‌ షర్టు వేసుకున్న ఒక బక్క పలచని యువకుడిని పరిచయం చేశాడు.
(ఇంకా…)

వర్గాలు In News · Telugu (తెలుగు) · సమీక్ష
Tagged: , , ,

యాభై ఏండ్ల ‘వూళ ‘

జూన్ 5, 2006 · వ్యాఖ్యానించండి

అక్టోబర్ 6, 1955. సిక్స్ గేలరీ, సాన్ ఫ్రాన్సిస్కో నగరం. గేరీ స్నైడర్ , జాక్ కెరాక్, మైఖెల్ మెక్ క్లూర్ , విలియంస్ బరోస్ , అలెన్ గిన్స్బర్గ్
తదితర యువకవులు కవిత్వం చదవడానికి చేరారు. గేలరీ కిటకిటలాడుతోంది. 28 ఏండ్ల యువకవి అలెన్ మైకు ముందుకొచ్చి తన కొత్త పద్యం చదవడం ప్రారంభించాడు. గేలరీ లో సూది పడితే వినబడేంత నిశ్శబ్దం. పద్యం పేరు ‘వూళ ‘. Article on Allen Ginsberg ‘Howl’ 50th Anniversary by NarayanSwamy published in Andhra Jyothyఅంటూ ప్రారంభమై, ఒక ప్రవాహంలా సాగిన ‘వూళ ‘ చదువుతున్నంత సేపూ శ్రోతల్లో తీవ్రమైన అలజడి…పెనుతుఫాను… పద్యం చదవడం అవగానే మార్మోగిన చప్పట్లు …. ‘ఎంత వుద్రేకం ? ఎంత క్రోధం ? ‘ … ఆనాడు అమెరికా సామాజిక పరిస్థితులు సౄష్టిస్తున్న విధ్వన్సానికి ఆగ్రహంతో మండిపడుతున్న అనేక మంది అలెన్ ను మనసారా అభినందించారు. ‘వూళ ‘ తో గొంతు కలిపారు. అట్లా అమెరికా సమాజంలో అంతర్లీనంగా పెల్లుబుకుతున్న అసంతృప్తికీ , పరాయీకరణకూ ‘వూళ ‘ కొత్త గొంతు నిచ్చింది. ఐసెన్ హోవర్ అమెరికా స్రృష్టిస్తున్న సామాజిక బీభత్సానికి వ్యతిరేకంగా తలెత్తుతున్న ధిక్కార సన్స్కృతికి ‘వూళ ‘ ఆది కావ్యమైంది, తిరుగబడుతున్న యువతరానికి జాతీయ గీతమయింది!

(ఇంకా…)

వర్గాలు Articles · In News · Telugu (తెలుగు)